తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్​కు ప్రజా సంక్షేమం కంటే ఆర్థిక లావాదేవీలే ముఖ్యం : భట్టి

ఆసుపత్రుల సందర్శనలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క... నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం ప్రజాసంక్షేమం పట్టదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

clp leader bhatti vikramarka visitation nalgonda government hospital
ముఖ్యమంత్రికి ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదు: భట్టి

By

Published : Sep 2, 2020, 7:15 AM IST

రాజకీయం, ఆర్థిక లావాదేవీలే కేసీఆర్​కు ముఖ్యమని... ప్రజా సంక్షేమం ఆయనకు ఏ మాత్రం పట్టదంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు... భూ పంచాయితీలు, ఇసుక దందాల్లో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రుల సందర్శనలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు.

ప్రభుత్వ దవాఖానాలను పేదల దేవాలయాలుగా అభివర్ణించిన భట్టి విక్రమార్క... నర్సింగ్ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ వైద్యులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేకపోవడం సిగ్గు చేటన్నారు. ఆసుపత్రుల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని... అటు కృష్ణా జలాల్లోనూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రికి ప్రజా సంక్షేమం ఏ మాత్రం పట్టదు: భట్టి

ఇది చూడండి 'ఎడారిలో తుపాను పుట్టించిన క్రికెటర్​ సచిన్'

ABOUT THE AUTHOR

...view details