నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్ శివకు కరోనా సోకింది. ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు తన వల్ల కరోనా సోకకుండా ఉండటానికి చెట్టుపై ఆవాసం ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్‌లో ఉన్నాడు. తొమ్మిది రోజుల పాటు అలా చెట్టుపైనే ఉన్న శివను.. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మండల కేంద్రంలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
చెట్టే ఐసోలేషన్ గది: ఆ కుర్రాడికి కొవిడ్ నెగెటివ్ - covid isolation centers in nalgonda district
కరోనా బారిన పడి.. ఇంట్లో ఒకే గది ఉండటం వల్ల చెట్టునే ఐసోలేషన్ గదిగా మార్చుకున్న బి.టెక్ విద్యార్థి వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కొవిడ్ నెగెటివ్ రావడం వల్ల అధికారులు ఆ యువకుణ్ని ఇంటికి తీసుకువెళ్లి.. అతని తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
అక్కడే చికిత్స పొందుతున్న శివకు తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. స్థానిక ఎంపీపీ బాలాజీ, సర్పంచ్ కొత్త మరెడ్డి, ఎస్సై వీరశేఖర్, మండల వైద్యాధికారి డాక్టర్ ఉపేందర్, తదితర నాయకులు ఇంటికి తీసుకువచ్చారు. ఆరోగ్యంగా తిరిగొచ్చిన కుమారుణ్ని ఆ కుటుంబానికి అప్పగించారు. ఇక నుంచి ఎవరైనా కరోనా బారిన పడి ఐసోలేషన్‌కు ఇబ్బందులు ఎదుర్కొంటే తమకు సమాచారమివ్వాలని.. వెంటనే తాము వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు.
- సంబంధిత కథనంఆ కుర్రాడికి చెట్టే ఐసోలేషన్ గది... ఎందుకంటే..!