తెలంగాణ

telangana

ETV Bharat / city

కారు దిగి కమలం గూటికి బూర.. ముహూర్తం ఫిక్స్​! - తెరాసకు బూర నర్సయ్యగౌడ్ రాజీనామా

Boora Narsaiah Goud is confirmed to join BJP: తెరాసకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ భాజపాలోకి చేరడానికి రంగం సిద్ధమైంది. ఇవాళ అమిత్​షాను కలిసి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు సమాచారం. బూర రాసిన రాజీనామా లెటర్​లో సీఎం కేసీఆర్ గురించి పలు కీలక విషయాలు పేర్కొన్నారు.

Boora Narsaiah Goud
Boora Narsaiah Goud

By

Published : Oct 15, 2022, 1:41 PM IST

Boora Narsaiah Goud is confirmed to join BJP: బూర నర్సయ్యగౌడ్ తెరాస సభ్యత్వానికి రాజీనామా చేసిన వేళ... భాజపాలో చేరుతారని ప్రచారానికి మరింత బలం చేకూరింది. మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున ఉన్న గౌడ సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి బూరతో భారతీయ జనతా పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ షా సమక్షంలో బూర భాజపా కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బూర నర్సయ్యగౌడ్ భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు సమాచారం. ఇవాళ అమిత్ షాను కలిసి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బూర నర్సయ్య పోటీ చేస్తారని... ఈ మేరకు భాజపా అధిష్ఠానం నుంచి హామీ లభించినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెరాస మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంశంపైనా కూడా తెరాసలో చర్చ జరుగుతోంది. బూర నర్సయ్య పార్టీ మార్పు నేపథ్యంలో కర్నెతో మాట్లాడానికి సంప్రదించగా ఆయన అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. అంతకు ఆయన తన రాజీనామా పత్రంలో సీఎం కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. అభిమానం, బానిసత్వానికి చాలా తేడా ఉందని బూర పేర్కొన్నారు. ఏదైనా విషయంలో ఉద్యమకారులు, కార్యకర్తలు సీఎంను కలవాలంటే పెద్ద ఉద్యమమే చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికపైనా పలు విషయాలు లేఖలో పేర్కొన్నారు.

మునుగోడు ఉపఎన్నిక వేళ అధికార తెరాసకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. మునుగోడు నియోజకవర్గంలో పెద్దఎత్తున ఉన్న గౌడ సామాజికవర్గాన్ని ఆకర్షించడానికి బూరతో భాజపా నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇప్పటికే భాజపా తమ వ్యూహాలతో ఉపఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో బలమైన నాయకుడు చేరనుండడంతో భాజపా వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇప్పటికే పలువురు నాయకులు భాజపా గూటికి చేరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details