నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో.. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేయాలని కోరుతూ బిహార్‌కు చెందిన వలస కూలీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో పాసుల కోసం పేర్లు నమోదు చేసుకున్న వలస కూలీలు.. మొబైల్ ఫోన్లకు ఓటీపీ నెంబర్ రావడం వల్ల ఒక్కసారిగా ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చారు. రెండు రోజులుగా పాసుల కోసం తిరుగుతున్నా.. అధికారులు ఏ విషయం చెప్పకుండా తమ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని వలస కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.
పాసుల కోసం రోడ్డెక్కిన బిహార్ కూలీలు - Bihar migration Labor Protest For Passes
తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పాసులు జారీ చేయాలని కోరుతూ నల్గొండ జిల్లాలో బిహార్‌కు చెందిన వలస కూలీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
పాసుల కోసం రోడ్డెక్కిన బీహారీ కూలీలు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాసుల కోసం ఎమ్మార్వో కార్యాలయం ముందు వేచి చూసిన కూలీలు.. అధికారుల తీరును నిరసిస్తూ.. రోడ్డెక్కి నిరసన తెలిపారు. తమ బాధను చెప్పేందుకు డీఎస్పీ ఆఫీసుకు ర్యాలీగా బయలుదేరిన వలస కూలీలను పోలీసులు అడ్డుకొని.. పాసులు రావడానికి కొంత సమయం పడుతుందని నచ్చజెప్పి పంపించారు.
ఇవీ చూడండి:విశాఖ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి