ఈ రోజు పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఎస్ఐబీలో ఓఎస్డీగా నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నలుగురు ఐపీఎస్‌లు రిటైర్డ్ అయితే... ప్రభాకర్‌రావుకు మూడు సంవత్సరాలు పొడిగించడమేంటని ప్రశ్నించారు. మిగతా ముగ్గురు కూడా 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు అందించినవారే... కాబట్టి వారికి కూడా సర్వీసు పొడిగించాలని డిమాండ్ చేశారు.
ప్రభాకర్‌రావుకే మూడేళ్లు పొడిగించడమేంటి?: ఎంపీ కోమటిరెడ్డి - ప్రభాకర్ రావు సర్వీసు పొడిగింపుపై కోమటిరెడ్డి ఆగ్రహం
రోజే పదవీ విరమణ పొందిన ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును ఒఎస్డీగా నియమించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.
![ప్రభాకర్‌రావుకే మూడేళ్లు పొడిగించడమేంటి?: ఎంపీ కోమటిరెడ్డి bhuvanagiri mp komatireddy venkat reddy fire on employees retirement age](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7835299-thumbnail-3x2-komatireddy.jpg)
ప్రభాకర్‌రావుకే మూడేళ్లు పొడిగించడమేంటి?: ఎంపీ కోమటిరెడ్డి
ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని వెంటనే పెంచాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి నుంచి చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వయోపరిమితి పెంచి... 18 నెలల నుంచి రిటైర్డైన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలన్నారు.
ఇదీ చూడండి:ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం