తెలంగాణ

telangana

ETV Bharat / city

రసాభాసగా భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక - రసాభాసగా భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక

భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక రసాభాసగా మారింది. నాలుగు స్థానాలకుగాను నాలుగు తెరాస కైవసం చేసుకుంది. డబ్బులతో తమ కౌన్సిలర్​ను కొనుగోలు చేసి అనైతికంగా ఎన్నికల్లో గెలుపొందారని కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు. తెరాసలో చేరిన కౌన్సిలర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు పురపాలక భవనం ఎదుట ధర్నాకు దిగారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కారును అడ్డగించారు.

రసాభాసగా భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక
రసాభాసగా భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక

By

Published : Aug 5, 2020, 7:57 PM IST

యాదాద్రి జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక రసాభాసగా మారింది. భువనగిరి మున్సిపాలిటీలోని నాలుగు స్థానాలను తెరాస కైవసం చేసుకోగా... కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారని కార్యకర్తలు ఆరోపించారు. భువనగరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి కారును అడ్డగించి నిరసన తెలిపారు.

దీంతో కాంగ్రెస్‌, తెరాస కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సంఖ్యాపరంగా తెరాస 17, కాంగ్రెస్‌ 11, భాజపా 7 కౌన్సిలర్‌ సీట్లు ఉండగా... ఇటీవల 11 వ వార్డు కౌన్సిలర్‌ జిట్టా వేణుగోపాల్‌ రెడ్డి తెరాసలో చేరటంతో తెరాస కౌన్సిలర్ల సంఖ్య 18కి చేరింది. ఐతే.. వేణుగోపాల్‌ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు

రసాభాసగా భువనగిరి మున్సిపాలిటీ కో ఆప్షన్ ఎన్నిక

ఇవీ చూడండి:ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం గాలికొదిలేసింది: భట్టి

ABOUT THE AUTHOR

...view details