యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ తండాలో దళిత,గిరిజన దండోరా సభ నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరికీ గిరిజనబంధు వర్తింపచేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాసాలమర్రికి సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఏడుగురు రెడ్లు, నలుగురు వెలమలకు చోటు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క దళితుడికి చోటు ఇవ్వలేదు అన్నారు. మంత్రివర్గంలో దళితులకు చోటు కల్పించలేదు గాని.. సీఎంఓలో రాహుల్ బొజ్జాకు చోటు ఇవ్వగానే దళితలందరికి న్యాయం చేసినట్లా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినో ముఖ్యమంత్రి చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Komatireddy Venkat Reddy: ఇంటికి కిలో బంగారం పంచినా తెరాసకు ఓటెయ్యరు'
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడో, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినో ముఖ్యమంత్రి చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన ఎవరు తెరాసకు ఓటు వేయరని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకనే కొకాపేట భూములు అమ్మేశారని విమర్శించారు.
ఇంటికి కిలో బంగారం పంచినా.. ఎవరు తెరాసకు ఓటు వేయరని ఎద్దేవా చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఇంటికి రూ.పది లక్షలు ఇస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మళ్లీ రాజకీయాల్లో పోటీ చేయనని.. ముఖ్యమంత్రి కుమార్తె కవితను పోటీలో దింపితే తానే గెలిపిస్తానని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకనే కొకాపేట భూములు అమ్మేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలేరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలి డిమాండ్ చేశారు. కేసీఆర్ కాళ్ల కింద ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని విడిపించాలిని, దానికి ఇంకా 20 నెలల సమయం ఉందని, కార్యకర్తలు అందరూ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి:RS PRAVEEN KUMAR: 'తెలంగాణ అసెంబ్లీని రేపే రద్దు చేసినా ఆశ్చర్యం లేదు'