ఆర్థిక లావాదేవీలన్నీ దాదాపు డిజిటల్ రూపమెత్తాక అభాగ్యులు, అన్నార్తులకు చిన్నాచితకా మొత్తాలు దానం చేసేవారూ తగ్గిపోయారు.. చిత్రంలో కనిపిస్తున్న ఈ వృద్ధుడి పేరు దారం లచ్చయ్య. ఈయనది నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారం గ్రామం. భార్యాపిల్లలు ఎవరూ లేక, వృద్ధాప్యంలో బతికే దారి తెలియక బిచ్చమెత్తుకుని గడుపుతున్నట్లు చెప్పారు.
'అయ్యా.. స్కాన్ చేయండి.. భిక్షం వేయండి' - డిజిటల్ స్కానర్ రూపంలో యాచన
ఆధునిక కాలానికి అనుగుణంగా ప్రతి రంగంలో సాంకేతికంగా మార్పులు వస్తూనే ఉన్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీలూ నేటి కాలంలో దాదాపు డిజిటల్ రూపంలోనే సాగుతున్నాయి. అభాగ్యులు, అన్నార్తులకు చిన్నా చతకా మొత్తాలు దానం చేసేవారూ తగ్గిపోయారు. దాంతో బతుకు బండి భారంగా మారిన తరుణంలో తన అద్భుత ఆలోచనతో ఓ వృద్ధుడు యాచిస్తున్న దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.
An old man living on a beg in digital form
డిజిటల్ స్కానర్ సాయంతో యాచిస్తూ నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం కెమెరా కంటికి చిక్కారు. పొట్టపోసుకోవడానికి చేయి చాస్తున్నా చిల్లర లేదంటున్నారని.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండడంతో దయగలవారు తోచింది ఇస్తారనే ఆశతో ఇక్కడకు వచ్చానని లచ్చయ్య చెప్పుకొచ్చారు.