తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరో 41 కరోనా కేసులు - ఉమ్మడి నల్గొండ జిల్లా కరోనా వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వరసగా రెండో రోజు కూడా 41 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకు జిల్లాలో 12 మంది వైరస్​తో మృత్యువాత పడ్డారు.

41 new corona cases registered in combine nalgonda district
ఉమ్మడి జిల్లాలో కొత్తగా మరో 41 కరోనా కేసులు

By

Published : Jul 12, 2020, 12:02 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో... తాజాగా 41 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 41 వెలుగు చూడగా... శనివారం కూడా అదే రీతిలో బయటపడ్డాయి. నల్గొండలో 28, సూర్యాపేటలో 7, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 పాజిటివ్​గా నిర్ధరణ అయినట్టు... ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మిర్యాలగూడలో 10, దేవరకొండలో 8, నల్గొండలో 6, సూర్యాపేటలో 3, చిట్యాలలో 2... గుడిపల్లి, నార్కట్ పల్లి, మునగాల, గరిడేపల్లి, చివ్వెంల, హుజూర్​నగర్ మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

దేవరకొండలో రెండేళ్ల చిన్నారి సహా... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా సోకింది. నల్గొండ జిల్లాలో ఒకరు కొవిడ్​తో మృతిచెందగా... ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా... 12 మంది మృత్యువాత పడ్డారు. నల్గొండలో 207, సూర్యాపేటలో 166, యాదాద్రిలో 50 మంది... వ్యాధికి గురయ్యారు.

ఇదీ చూడండి:దేశంలో మరో 28,637 కేసులు.. 551 మరణాలు

ABOUT THE AUTHOR

...view details