తెలంగాణ

telangana

ETV Bharat / city

సారు.. కారు.. పదహారు.. సొంత జిల్లాకు కేసీఆర్​ - తెరాస ఎన్నికల ప్రచారం

16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిరంతరం సభల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. నేడు మెదక్​, జహీరాబాద్​ల​లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు తెరాస నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

తెరాస సభలు

By

Published : Apr 3, 2019, 5:13 AM IST

Updated : Apr 3, 2019, 3:41 PM IST

మెదక్​, జహీరాబాద్​లో పర్యటించనున్న కేసీఆర్​
లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఇవాళ మెదక్​, జహీరాబాద్​లలో పర్యటించనున్నారు. నియోజకవర్గాలకు చెందిన బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. సొంత జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సీఎం మరోసారి వరాల జల్లు కురిపిస్తారని స్థానిక నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా జనసమీకరణ

మొదటగా జహీరాబాద్​ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న నియోజకవర్గానికి మధ్య ప్రాంతమైన అల్లదుర్గంలో సభను ఏర్పాటు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్​, తెరాస ఎంపీ బీబీ పాటిల్​ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం నాలుగు గంటలకు సీఎం సభాస్థలికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడం వల్ల తెరాస నేతలు భారీగా జనసమీకరణ చేయనున్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు 2 లక్షల మంది జనాభాను సమీకరిస్తున్నట్లు తెరాస నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీ దళపతి పర్యటన పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపనుంది.

హరీశ్​రావు పరిశీలన

జహీరాబాద్​ సభ అనంతరం మెదక్​ పార్లమెంటు సభలో పాల్గొననున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా నర్సాపూర్​లో దీనిని ఏర్పాటు చేశారు. సభా ఏర్పాట్లను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయనతో పాటు పద్మాదేవేందర్​రెడ్డి, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​రెడ్డి, తెరాస నాయకులు ఉన్నారు.ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్​ అధినేత రాహుల్​గాంధీ సభ నిర్వహణతో కేసీఆర్​ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి :ప్రధాని పదవి కాదు దేశ ప్రజల అభివృద్ధి కావాలి

Last Updated : Apr 3, 2019, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details