మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శనివారం తెల్లవారుజామున మేతకు వెళ్లిన పశువుల మందపై పులి దాడి చేసింది. కొన్ని పశువులు కనిపించకుండా పోగా.. నాలుగింటికి తీవ్రగాయాలయ్యాయి.
పశువులపై పులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు.. - tiger attack on animals at turkapalli
తెల్లవారుజామున మేతకు వెళ్లిన పశువుల మందపై పులి దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం తుర్కపల్లి అటవీప్రాంతంలో జరిగింది. ఘటనపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని .. పశువులను తీసుకుని అడవి వైపు వెళ్లొద్దని గ్రామంలో డప్పు చాటింపు వేయించారు.
పశువుల పై పులి దాడి.. భయాందోళనలో గ్రామస్థులు
పులి దాడి చేసిన ఘటనతో గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. గ్రామస్థులెవరూ అడవి వైపు వెళ్లవద్దంటూ డప్పు చాటింపు వేయించారు.
ఇదీ చదవండి:పెద్దపల్లిలో పెద్దపులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి : అటవీ శాఖ