సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ఎస్సీసీఎల్(SCCL) ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి రిటైర్ అయిన అందరికీ ఈ నిర్ణయం వర్తించనుందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. 61 ఏళ్లు నిండని విశ్రాంత ఉద్యోగులంతా... ఈ నెల 31లోపు విధుల్లో చేరాలని స్పష్టం చేసింది.
Singareni: సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు - సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ
20:05 August 12
సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ 61 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు
మార్చి 31 నుంచి రిటైరయిన 1082 మంది మళ్లీ విధుల్లోకి చేరాలని సింగరేణి యాజమాన్యం పేర్కొంది. పదవీ విరమణ వయసు పెంపుతో 43,899 మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు వివరించింది. సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: