మంచిర్యాల జిల్లాకు నియామకమైన 26 మంది నూతన మహిళ పోలీసు కానిస్టేబుళ్లతో డీసీపీ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ సమావేశమయ్యారు. ఒక్కొక్కరి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
'మానవతా దృక్పథంతో పనిచేసి మంచిపేరు తీసుకురావాలి' - ramagundam news
మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లతో రామగుండం సీపీ సమావేశమయ్యారు. మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
'మానవతా దృక్పథంతో పని చేసి మంచి పేరు తీసుకురావాలి''మానవతా దృక్పథంతో పని చేసి మంచి పేరు తీసుకురావాలి'
ఎంతో కష్టపడి ఉద్యోగం సాధించి 9 నెలల శిక్షణను పూర్తి చేసుకొని తమ సేవలను ప్రజలకు, పోలీసు శాఖకు అందించేందుకు వచ్చిన్నందుకు చాలా సంతోషంగా ఉందని సీపీ తెలిపారు.
నూతన ఉత్సాహంతో పని చేస్తూ... ప్రజల పట్ల మానవత దృక్పథంతో విధులు నిర్వర్తించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో తారతమ్య భావన లేకుండా పని చేసి రామగుండం పోలీస్ కమిషనరేట్‌కి, మంచిర్యాల జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సీపీ కోరుకున్నారు.