పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎండల దృష్ట్యా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పిల్లల్ని పరీక్ష కేంద్రంలోకి పంపి తల్లిదండ్రులు చెట్ల కింద సేద తీరారు.
ప్రశాంతంగా ప్రారంభమైన పాలిసెట్ ప్రవేశ పరీక్ష - పాలీ సెట్ ప్రవేశ పరీక్ష
మంచిర్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. వేసవికాలం అయినందున విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.
పాలీ సెట్ ప్రవేశ పరీక్ష