తెలంగాణ

telangana

ETV Bharat / city

'స్వచ్ఛ తెలంగాణ'లో భాగంగా సంచార మరుగుదొడ్లు ప్రారంభం - మొబైల్​ టాయిలెట్లు ప్రారంభించిన కలెక్టర్​ హోళికేరీ

'స్వచ్ఛ తెలంగాణ'లో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లను పురపాలక సంఘం కార్యాలయంలో ఎమ్మెల్యే దివాకర్​రావు, కలెక్టర్​ భారతి హోళీకేరి కలిసి ప్రారంభించారు. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న బస్సులతో వీటిని తయారుచేయించినట్లు కలెక్టర్​ తెలిపారు.

mobile toilets started by collector holikeri and mla diwakar rao at mancherial
'స్వచ్ఛ తెలంగాణ'లో భాగంగా సంచార మరుగుదొడ్లు ప్రారంభం

By

Published : Oct 2, 2020, 1:07 PM IST

మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయంలో 'స్వచ్ఛ తెలంగాణ'లో భాగంగా సంచార మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే దివాకర్​రావు, కలెక్టర్​ భారతి హోళీకేరి కలిసి వాటిని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని జనాభా ప్రాతిపదికన 87 పబ్లిక్​ టాయిలెట్లు అవసరమవగా.. 92 మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దివాకర్​రావు వెల్లడించారు.

స్వచ్ఛత కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులను చేయిస్తోందని కలెక్టర్​ భారతి అన్నారు. రాష్ట్ర రవాణాసంస్థలో నిరుపయోగంగా ఉన్న బస్సులను మున్సిపాలిటీ కొనుగోలు చేసి మరుగుదొడ్లుగా తయారు చేయించారని తెలిపారు. ప్రజారద్దీ ఉన్న ప్రాంతాల్లో ఈ సంచార టాయిలెట్లను ఏర్పాటు చేయనున్నట్లు హోళీకేరీ వివరించారు.

ఇదీ చదవండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ABOUT THE AUTHOR

...view details