Gurukul students dharna at bellampally: ప్రతి విషయానికి టీసీ ఇస్తానని పాఠశాల ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాల నుంచి కాలినడకన పట్టణంలోని కాంటా చౌరస్తాకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మూత్రానికి వెళ్లినా టీసీ ఇచ్చి పంపిస్తానని ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేధిస్తున్నాడని ఆరోపించారు.
టాయిలెట్‌కి వెళ్లినా టీసీ ఇస్తానని ప్రిన్సిపల్ బెదిరింపు... ఆందోళనకు దిగిన విద్యార్థులు - బెల్లంపల్లి తాజా వార్తలు
Gurukul students dharna at bellampally: ఎంతో కష్టపడి గురుకుల పాఠశాలలో సీటు సంపాదించారు ఆ విద్యార్థులు. తమ పిల్లలు సమయానికి తిని ఆరోగ్యంగా ఉంటూ.. బాగా చదువుకుంటారని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ ఓ పాఠశాల ప్రిన్సిపల్ ప్రతి చిన్న విషయానికి టీసీ ఇస్తానని బెదిరిస్తుండటంతో ఆ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
![టాయిలెట్‌కి వెళ్లినా టీసీ ఇస్తానని ప్రిన్సిపల్ బెదిరింపు... ఆందోళనకు దిగిన విద్యార్థులు Gurukul students dharna](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14624082-30-14624082-1646294394419.jpg)
ధర్నాకు దిగిన విద్యార్థులు
మాడిన అన్నం పెడుతూ, తాగడానికి సురక్షితమైన తాగునీరు అందించడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వైపు పరుగులు తీశారు. చివరకీ పోలీసులు వారికి నచ్చజెప్పి పాఠశాలకు పంపించడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి:Student Died in school: క్లాస్‌రూంలో క్రికెట్.. స్టూడెంట్స్ మధ్య గొడవ.. ఒకరు మృతి..