ఈటీవీ భారత్ ప్రయత్నం... ఏడాది సమస్యకు పరిష్కారం - solution to drinking water problem in manchirial
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన "సమస్య చెంతకు అధికారి" కార్యక్రమానికి మంచిర్యాలలో స్పందన లభించింది. ఏడాదిగా ప్రజలు పడుతున్న నీటి కష్టాల నుంచి ఎన్టీఆర్ నగర్ కాలనీవాసులకు అధికారులు విముక్తి కల్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్రగా ఈనాడు, ఈటీవీ భారత్ చేస్తున్న సామాజిక కార్యక్రమాల పట్ల ప్రజలు, అధికారులు అభినందనలు తెలిపారు.
ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో చేపట్టిన "సమస్య చెంతకు అధికారి" కార్యక్రమానికి స్పందన లభించింది. మంచిర్యాలలోని ఎన్టీఆర్ నగర్లో నిరుపయోగంగా పడి ఉన్న మోటారు బోరుకు అధికారులు మరమ్మతులు చేశారు.
కాలనీలో రెండేళ్ల క్రితం ప్రజా అవసరాల కోసం బోర్ వేశారు. ఏడాది తర్వాత బోర్ మోటర్ చెడిపోవటం వల్ల నీళ్లు రాక... కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ఈనాడు, ఈటీవీ భారత్ బృందం... అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి 24 గంటల లోపే పరిష్కారాన్ని చూపారు.
స్వయంగా అధికారే వచ్చి సమస్యను పరిష్కారిచటం వల్ల కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి పడుతున్న నీటి కష్టాల నుంచి తమకు విముక్తి కల్పించిన ఈటీవీ భారత్, ఈనాడుకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి కాలనీలోని ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మురుగు నీటి సమస్య ఉందని కాలనీవాసులు తెలపగా... త్వరలోనే సమస్యను పరిష్కరించాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి పట్ల చాలా ఆనందంగా ఉందని కమిషనర్ స్వరూపరాణి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్రగా ఈనాడు, ఈటీవీ భారత్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను కమిషనర్ అభినందించారు.