తెలంగాణ

telangana

ETV Bharat / city

YS Sharmila: పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నేడు షర్మిల దీక్ష - mahabubnagar latest news

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి మంగళవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ వద్ద షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Sep 7, 2021, 4:36 AM IST

ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను సాధించేందుకు జిల్లాల బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద ఆమె నిరుద్యోగ నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహర దీక్ష కొనసాగించేలా ఎంపిక చేసిన జిల్లాల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు షర్మిల.

తొలిసారిగా జులైలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని తాడిపర్తి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించిన షర్మిల.. నిరుద్యోగుల ఆహ్వానం మేరకు ఇవాళ మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. అనంతరం ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇవీ చూడండి:Jeevitha Rajasekhar: బండ్ల గణేశ్​తో గొడవపై స్పందించిన జీవిత

ABOUT THE AUTHOR

...view details