మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పురపాలిక ఎన్నికల బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు... అభ్యర్థుల తరపున బీ-ఫాం సమర్పించడంతో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలచారో స్పష్టమైంది. జడ్చర్ల మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు ఎన్నికల జరుగుతుండగా తెరాస 27 వార్డులు, కాంగ్రెస్ 25 వార్డులు, భాజపా 22 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. సీపీఐ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఒక్కరు, ఎంఐఎం నుంచి ఏడుగురు ఎన్నికల బరిలో నిలవగా అన్నివార్డుల్లో కలిపి 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
భాజపా నుంచి ఆశించి తెరాస నుంచి టికెట్
మొత్తం అన్ని వార్డుల్లో 112 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. పార్టీ అభ్యర్థిత్వం దక్కుతుందన్న ఉద్దేశంతో ఒకే పార్టీ ఎక్కువ మంది ఆశావహులు పోటీపడ్డారు. బుజ్జగింపులు, తాయిలాలు, భవిష్యత్తు హామీల నడుమ చాలామంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలు ఎవరికి అభ్యర్థిత్వం కట్టబెడతాయన్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడింది. జడ్చర్లలో భాజపా నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడిన 15వ వార్టు మహిళ అభ్యర్థి అనూహ్యాంగా తెరాస తరఫున బీఫాం పొంది బరిలో నిలిచారు. ఈసందర్భంగా శుక్రవారం వారంతా తమ అనుయాయులతో తెరాసలో చేరనున్నారు.
తెరాస-భాజపా వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం