మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు తలపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల పరిశీలన ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతల పర్యటన గురించి సమాచారం అందుకున్న దివిటిపల్లి గ్రామ తెరాస నాయకులు.. అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. దీంతో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటల మధ్యనే కాంగ్రెస్ నేతలు రెండు పడక గదుల ఇళ్లను పరిశీలించారు.
ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న దివిటిపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నేతలతో వాదనకు దిగారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూడడానికి కాంగ్రెస్ నేతలు రావద్దంటూ మండిపడ్డారు. ఇక్కడ మౌలిక వసతుల కల్పన లేవని... అవి సమకూర్చిన తర్వాత లబ్ధిదారులకు అందజేయనున్నామని పేర్కొన్నారు.