తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆసుపత్రులు సందర్శించని ఏకైక సీఎం కేసీఆర్' - ముఖ్యమంత్రిపై కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపాటు

కోవిడ్​తో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా... ఆసుపత్రులను సందర్శించని ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్​ చరిత్రలో నిలిచిపోతారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి విమర్శించారు.

tdp spoke person kothakpt adayakar reddy fires on cm kcr
'ఆసుపత్రులు సందర్శించని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్'

By

Published : Jun 9, 2020, 4:24 PM IST

కోవిడ్‌-19 నేపథ్యంలో దాతల నుంచి వచ్చిన విరాళాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. పేద, మధ్యతరగతి వాళ్లకు ఈ మూడు నెలల విద్యుత్‌ బిల్లులు రద్దు చేయాలని కోరారు. గతేడాది వచ్చిన బిల్లులనే కడితే సరిపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిన బిల్లులు చూస్తే ప్రజలకు షాక్‌ కొట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

మూడు నెలల బిల్లులు ఒకేసారి ఇవ్వడం వల్ల... స్లాబ్‌లు మారి ధరలు పెరిగిపోయాయని దయాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులో అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని మంత్రి జగదీశ్ రెడ్డి చెబుతున్నా... కార్యాలయాల్లో మాత్రం ఎవ్వరు ఉండటం లేదని వాపోయారు. కోవిడ్‌ మృతుల కుటుంబాలను, ఆసుపత్రులను సందర్శించని ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి:ఒకే ఇంట్లో 26 మందికి కరోనా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details