ప్రజలందరూ కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలని జిల్లా ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి: ఎస్పీ అపూర్వరావు - ఎస్పీ అపూర్వరావు
వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
sp
కొవిడ్ మొదటి దశ కన్నా.. రెండవదశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులతో పాటు ప్రజలందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ చేయించుకోని కరోనాను నివారించేందుకు కృషి చేయాలన్నారు. అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కోరారు.