దళిత, గిరిజనుల హక్కుల పరిరక్షణకై జన అదాలత్ కార్యక్రమంలో భాగంగా... ఈ నెల 8,9,10 తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ బృందం పర్యటించనుంది. మొదటిరోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని మార్చాలా, అచ్చంపేట నియోజకవర్గంలోని కొండనాగుల సమీపంలోని గుడిబండ ప్రాంతంలోని... చెంచు జాతుల జీవన విధానాలను పరిశీలించనున్నారు. 9,10 తేదీల్లో మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలోని పలు చెంచు ప్రాంతాల్లో పర్యటించి... వినతులు స్వీకరించనున్నారు.
8 నుంచి మహబూబ్నగర్లో ఎస్సీ, ఎస్సీ కమిషన్ పర్యటన - ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉమ్మడి మహబూబ్నగర్ పర్యటన
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్... ఈ నెల 8 నుంచి మూడు రోజులు పర్యటించనున్నారు. దళిత, గిరిజన హక్కుల పరిరక్షణకై... జన అదాలత్ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 8 నుంచి మహబూబ్నగర్లో ఎస్సీ, ఎస్సీ కమిషన్ పర్యటన
పర్యటన అనంతరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జన అదాలత్ కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా చేపట్టినట్టు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. కమీషనే ప్రజల ముందుకు వస్తుందన్నందున... ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి:సాగర్, మిర్యాలగూడల్లో ఎత్తిపోతలు.. హాలియాలో డిగ్రీ కాలేజీ