నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్స్ వేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తమ సిబ్బందితో కలిసి వెంచర్‌లో ఉన్న రాళ్లను తొలగించారు. ఆగ్రహించిన మేకల రాముడు, గడ్డం శేఖర్ యాదవ్, బరిగెల బాలయ్య, వెంకటేష్ యాదవ్ మున్సిపాలిటీ కార్యాలయంలోకి చొరబడి కమిషనర్ వెంకటయ్యను నానా బుతులు తిట్టారు. అక్కడే ఉన్న వాటర్ బాటిల్‌తో దాడికి యత్నించారు. నీ సంగతి చూస్తామంటూ బెదిరించారు. వెంచర్స్‌లో రాళ్లు తొలగించడానికి నువ్వు ఎవడ్రా అంటూ కమిషనర్‌ను దుర్భాషలాడారు.
రియల్ రౌడీలు.. మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నం
నాగర్ కర్నూల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండా వేసిన అక్రమ వెంచర్స్‌ను ఇటీవల మున్సిపల్ సిబ్బంది తొలిగించారు. ఆగ్రహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్సిపాలిటీ కార్యాలయంలోకి చొరబడి కమిషనర్ వెంకటయ్యను నానా బూతులు తిడుతూ.. దాడికి యత్నం చేశారు.
రియల్ రౌడీలు.. మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నం
దాడికి యత్నించిన నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కమిషనర్. అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Last Updated : Mar 10, 2020, 8:03 PM IST