తెలంగాణ

telangana

ETV Bharat / city

మృగాళ్ల కామవాంఛకు యువతి బలి

మానవత్వం మంట కలిసింది. మృగాళ్ల కామవాంఛ ఓ అమాయకురాలిని బలితీసుకుంది. స్కూటీ టైరు పంక్చర్‌ కావడం వల్ల సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రియాంకను.... అత్యాచారం చేసి జాతీయ రహదారి పక్కనే కిరాతకంగా హతమార్చిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులు... లారీ డ్రైవర్‌, క్లీనర్‌గా గుర్తించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

shadnagar
shadnagar

By

Published : Nov 29, 2019, 5:15 AM IST

Updated : Nov 29, 2019, 3:05 PM IST

సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలోని తొండుపల్లి జంక్షన్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు... వైద్యురాలిని అత్యాచారం చేసి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. ప్రియాంక రెడ్డిని ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌కు 50మీటర్ల దూరంలో అత్యాచారం చేసిన నిందితులు అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని వారి లారీలో షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్‌ పోసి నిప్పంటించారు.

భయంగా ఉందంటూ చెల్లికి ఫోన్‌...

శంషాబాద్‌కు చెందిన యువతి... మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లూరులో పశువైద్యురాలిగా పనిచేస్తోంది. చర్మ సంబంధిత వైద్యం కోసం స్కూటీపై.... గచ్చిబౌలికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. స్కూటీలో గాలి లేకపోవడం వల్ల రాత్రి 9గంటల సమయంలో... ఓ వ్యక్తి గాలి నింపుకొస్తానంటూ ద్విచక్రవాహనం తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అక్కడి నుంచే తన సోదరికి ఫోన్‌లో వివరించింది. ఇద్దరు లారీ డ్రైవర్లు తనను వెంబడిస్తున్నారని, భయంగా ఉందని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. రాత్రి పది దాటినా ఇంటికి రాకపోవడం వల్ల అనుమానించిన సోదరి. .. తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో గాలించింది. అయినా ఆచూకీ లభించలేదు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

10 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు..

షాద్‌నగర్ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారి వంతెన కింద కాలుతున్న మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో శంషాబాద్ పోలీసులు మృతురాలి కుటుంబసభ్యులను తీసుకొని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహం ఆనవాళ్లు వైద్యురాలివేనని గుర్తించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. 10 బృందాలుగా ఏర్పడి జాతీయ రహదారితో పాటు.. బాహ్యవలయ రహదారి చుట్టూ గాలించారు. సీసీ ఫుటేజీని విశ్లేషించారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలంలో క్లూస్ టీంతో తనిఖీలు నిర్వహించారు.

ఈ అమానుష ఘటనను వ్యతిరేకిస్తూ.... కాలనీవాసులు జాతీయ రహదారిపై కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.

ఇవీ చూడండి:రాజధాని శివారులో యువ వైద్యురాలి దారుణహత్య

Last Updated : Nov 29, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details