కరోనాతో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని వైద్యారోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు.
కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్ - మహబూబ్‌నగర్‌లో ప్రైవేటు ఆస్పత్రి సీజ్
![కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్ private hospital sezed in mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6682428-980-6682428-1586168866710.jpg)
12:56 April 06
కరోనా బాధితురాలికి చికిత్స.. ప్రైవేటు ఆస్పత్రి సీజ్
రంగారెడ్డి జిల్లా చేగూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. సదరు మహిళను పరీక్షించిన వైద్యుడు నిబంధనలకు విరుద్ధంగా ఎండోస్కోపీ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడం వల్ల జనరల్ ఆస్పత్రికి సిఫార్సు చేశారు.
పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జనరల్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వల్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవిడ్-19 నిర్ధరణ అయింది.
మహబూబ్‌నగర్‌లో ఆమె చికిత్స పొందిన ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆస్పత్రిలో రసాయనాలను స్ప్రే చేయించిన అనంతరం సీజ్ చేశారు.
ఇవీచూడండి:సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం... వ్యక్తి అరెస్ట్