రైతుల కోసం ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు చేపట్టినా.. ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వారి బతుకులు మాత్రం మారడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధికి వేళ్ల మైల దూరంలో ఉన్నాయి రైతుల జీవితాలు. కాడెద్దులు కొనే స్తోమత లేక.. కనీసం వాటిని అద్దెకు తీసుకనే ఆర్థిక స్థితి లేక ఓ రైతు చేసిన పని చూసి ఆ గ్రామస్థులు షాకయ్యారు. ఇంతకీ ఆ కర్షకుడి చేసిన పనేంటంటే..?
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. అన్నదాతను ఆదుకున్న బీడీఎల్ ఫౌండేషన్ - bdl foundation news
నారాయణపేట జిల్లాకు చెందిన ఓ నిరుపేద రైతు కుటుంబానికి కాడెద్దులు కొనే ఆర్థిక స్తోమత లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని పంట సాగు చేస్తేనే కడుపు నిండేది. కొనుగోలు భారమై కుటుంబ సభ్యులే కాడెద్దులుగా మారారు. భార్యాకూతుళ్లు కాడెద్దుల్లా అరకని లాగుతూ.. వ్యవసాయ పనులను సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీడీఎల్ ఫౌండేషన్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన లక్ష్మన్న కౌలు రైతు. సమీపంలోని వెంకటాపూర్‌లో ఎకరా పొలం కౌలుకు తీసుకొని బెండ తోట వేశారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలతో కలుపు పెరిగింది. సొంతంగా కాడెద్దులు లేకపోవడంతో భార్య, కుమార్తెలు చెరో వైపు కాడిపట్టి లాగుతుండగా.. రైతు దంతెపడుతూ కలుపు తొలగించారు. కూలీల ద్వారా కలుపు తీయించాలంటే రూ.2,500 వరకూ ఖర్చవుతుందని.. అంత మొత్తం వెచ్చించలేకే ఇలా భార్య, కుమార్తె కాడెద్దుల్లా మారాల్సి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు అరికెపూడి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. విద్యుత్తు శాఖ తరఫున రూ. 5 వేల నగదు, నూతన వస్త్రాలు అందించారు. త్వరలోనే కాడెద్దులతో పాటు ఓ పాడిగెేదెను అందిస్తామని హామీ ఇచ్చారు. సాయం పట్ల బాధిత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రఘు అరికెపూడికి కృతజ్ఞతలు తెలిపారు.