మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ప్రతి బుధవారం ఉల్లి వేలంపాట నిర్వహిస్తారు. మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల పరిధిలో ఉల్లి సాగుచేసే రైతులు పంటను విక్రయించేందుకు మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఇక్కడ ఉల్లిని కొనుగోలు చేసేందుకు.. వ్యాపారులతో పాటు వినియోగదారులు కూడా పోటీపడుతుంటారు.
రైతుల ఆవేదన.. వినియోగదారుడికి ఆనందం - onion price latest news
ఉల్లి ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. కొత్త ఉల్లి రాకతో నాణ్యతను బట్టి కిలో రూ.15 నుంచి రూ.20 లభిస్తుండగా వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో వైపు సాగు చేసిన రైతులు పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకు పడిపోతున్న ఉల్లి ధర
మార్కెట్లోకి కొత్త ఉల్లి ఉల్లి రాకతో ధరలు వారం వారం తగ్గుతున్నాయి. ఫలితంగా మార్కెట్కు వినియోగదారుల తాకిడి పెరిగింది. గత వారం క్వింటా ఉల్లి రూ.1500 నుంచి రూ.2000 ధర పలికింది. ఈ వారం మరింత తగ్గి రూ.900 నుంచి రూ.1750గా ఉంది. రోజురోజుకు ఉల్లి ధర తగ్గడంపై సాగు చేసిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు మాత్రం ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:భారత్లో 28 మందికి కరోనా: కేంద్ర మంత్రి