తెలంగాణ

telangana

By

Published : Oct 11, 2020, 9:53 PM IST

ETV Bharat / city

'ఆడపిల్లల పట్ల వివక్షను నిర్మూలించటం తల్లితోనే సాధ్యం'

మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా... మహిళల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఆడపిల్లల పట్ల వివక్షను నిర్మూలించటం తల్లితోనే సాధ్యం'
'ఆడపిల్లల పట్ల వివక్షను నిర్మూలించటం తల్లితోనే సాధ్యం'

సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పోవాలని... అది తల్లులతోనే సాధ్యమవుతుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా... మహిళల పట్ల వివక్ష మాత్రం తగ్గడం లేదని ఆవేదన చెందారు. మహబూబ్​నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

హనుమాన్​పుర, బండమీదిపల్లి, ప్రేమ్​నగర్ కాలనీల్లో రూ.68లక్షలతో నిర్మించనున్న మురికి కాల్వలు, సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. బొక్కలోనిపల్లిలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బ్రాహ్మణవాడిలోని ఆర్య సమాజ్​లో దసరా ఉత్సవ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన నశా ముక్త్ భారత్ పథకం కింద జిల్లాలోని మహిళలు, చిన్నపిల్లల సంక్షేమంకోసం 10 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలపట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేసేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్ల వద్ద ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

ఇవీ చూడండి: లారీ బీభత్సం..ఆటోలో వెళ్తున్న ఇద్దరు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details