Srinivas Goud visited flood affected areas in Mahabubnagar: మహబూబ్‌నగర్ పట్టణంలో వరదనీరు, మురుగునీరు సులభంగా బయటకు వెళ్లేలా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రాష్ట్రవ్యాప్తంగా గత వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఊహించని వర్షంతోనే ముంపు ముప్పు: పెద్ద చెరువు కింది ప్రాంతంలో వెళ్లే దారిలో పెద్ద ఎత్తున నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో అధికార యంత్రాంగం అప్రమత్తమై సహాయకచర్యలు ప్రారంభించారు. దీనితో అక్కడ సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి గడిచిన రెండు రోజుల నుంచి పాలమూరు పట్టణంలో ఎప్పుడు ఊహించని విధంగా 10.7 సెంటి మీటర్ల వర్షం కురిసిందన్నారు. తక్కువ సమయంలో పెద్దవర్షం కురవడం వల్ల రామయ్యభౌలి సహా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిందని మంత్రి తెలిపారు.