తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజల ఆరోగ్యంపైన ప్రత్యేక దృష్టి: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ - minister srinivas goud in mahaubnagar

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్​ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్​ ఎయిర్​ జిమ్​ను మంత్రి శ్రీనివాస్​రెడ్డి ప్రారంభించారు. ప్రజలు ఆరోగ్యం పెంపొందించుకునేందుకు వీలుగా... జిల్లాలో క్రీడాప్రాంగణాలు, వాకింగ్​ట్రాక్‌లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

minister srinivas goud started open air gym in mahaboobnagar
minister srinivas goud started open air gym in mahaboobnagar

By

Published : Dec 11, 2020, 3:40 PM IST

ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి రోగాలు దరి చేరవని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ సూచించారు. అందుకనుగుణంగా.... మహబూబ్​నగర్​ జిల్లాలో క్రీడాప్రాంగణాలు, వాకింగ్​ట్రాక్‌లు, పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌, యోగా శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

ఓపెన్​ ఎయిర్​ జిమ్​...

దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఎకో పార్కును మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేయగా.. స్థానికులకు వెసులుబాటుగా ఉండేందుకు వాకింగ్​ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. మైదానంలో ఓపెన్‌ ఎయిర్ జిమ్‌, మహిళల కోసం ప్రత్యేకంగా మరో జిమ్​తో పాటు యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్టు మంత్రి పేర్కొన్నారు. అనంతరం... మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని మంత్రి పరిశీలించారు.

జిమ్​లో సాధన చేస్తున్న మంత్రి...

ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు

ABOUT THE AUTHOR

...view details