మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. జిల్లాలో చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ది పనులపై సమీక్షించారు. జాతీయ రహదారుల పనులు, జంక్షన్ల నిర్మాణం పనులు త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్నారు. మహబూబ్‌నగర్- జడ్చర్ల మధ్య నిర్మించే జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించండి: శ్రీనివాస్ గౌడ్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడుతున్న జంక్షన్‌ల అభివృద్ది, రహదారి నిర్మాణాల పనులపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమీక్షించారు. చేపట్టాల్సిన పనులపై అథికారులకు దిశానిర్ధేశం చేశారు.
![కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించండి: శ్రీనివాస్ గౌడ్ minister srinivas goud review on raos works in mahabubanagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8632833-457-8632833-1598920629079.jpg)
కరోనా బాధితుల పట్ల మానవత్వం చూపించండి: శ్రీనివాస్ గౌడ్
జిల్లా కేంద్రంలో సైతం నిర్మించే నూతన రహదారి పనులను వేగవంతం చేయాలని.. వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కరోనా బాధితులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటే... కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు మంత్రి ఆదేశించారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, కరోనా వైరస్ సోకిన వారికి మనోధైర్యం కలిగించాలే తప్ప... చులకనగా చూడకూడదని హితవు పలికారు. ఈ సందర్బంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆన్‌లైన్ తరగతులకు సంబందించిన కర పత్రాన్ని విడుదల చేశారు.