తెలంగాణ

telangana

ETV Bharat / city

మహిళా సంఘాల శ్రమ అభినందనీయం: శ్రీనివాస్​గౌడ్​ - వండర్ బుక్ ఆఫ్ రికార్డు

మహబూబ్​నగర్​లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఎక్స్పో ప్లాజాలో స్వయం సహాయక మహిళా సంఘాల అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించిన మహిళా సంఘాలను మంత్రి అభినందించారు.

మహిళా సంఘాల శ్రమ అభినందనీయం: శ్రీనివాస్​గౌడ్​
మహిళా సంఘాల శ్రమ అభినందనీయం: శ్రీనివాస్​గౌడ్​

By

Published : Nov 11, 2020, 10:00 PM IST

అన్ని రంగాల్లో వెనుకబడిన మహబూబ్​నగర్ జిల్లా ప్రస్తుతం ఎంతో అభివృద్ధి చెందిందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. జిల్లా మహిళా సంఘాల సభ్యులు వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించటమే అందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న ఎక్స్పో ప్లాజాలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక మహిళా సంఘాల అభినందన సభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

9 రోజుల్లో కోటీ 14 లక్షల విత్తన బంతులను తయారుచేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్​ లో స్థానం సంపాదించిన మహిళా సంఘాలను మంత్రి అభినందించారు. 2600 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కేసీయార్ ఎకో అర్బన్ పార్క్... దేశంలోనే మొదటిదని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు సర్టిఫికేట్, గోల్డ్ మెడల్​ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి నరేందర్ గౌడ్ ప్రదానం చేశారు.

ఇదీ చూడండి: ఆ పెళ్లికి సినీ ఫక్కీలో అడ్డంకులు... చివరికి ఏమైందంటే...!

ABOUT THE AUTHOR

...view details