నిరుపేదలందరికి నీడ కల్పించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. వనపర్తి జిల్లా గణపురం మండలం ఆయన పర్యటించారు. పోతుల కుంటలో పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అర్హులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.
పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం: నిరంజన్‌రెడ్డి - వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన
వనపర్తి జిల్లాలో మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటించారు. గణపురం మండంల పోతులకుంటలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అర్హులకు పట్టాలు అందజేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ చేయడానికి వచ్చిన మంత్రి నిరంజన్‌రెడ్డిని గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.
![పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం: నిరంజన్‌రెడ్డి minister niranjan reddy inaugurated double bed room houses in wanaparthy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10013816-571-10013816-1608975486505.jpg)
పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం: నిరంజన్‌రెడ్డి
ప్రస్తుతం ఇలు రాని వారు బాధపడొద్దని.. అర్హులైన వారందరికి ఇంటి పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంకా చాలా ప్రాంతాల్లో ఇళ్లు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వాటన్నింటిని పూర్తి చేసి పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:పాత కక్షలతో కాల్పులు: ఆదిలాబాద్ ఘటనలో వ్యక్తి మృతి