లాక్ డౌన్ నేపధ్యంలో కరోనావ్యాప్తిని అరికట్టడమే కాకుండా.. నిత్యావసరాలు, అత్యవసరాలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహబూబ్ నగర్ కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనందున.. రెడ్‌జోన్‌గా ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.
'ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం' - కరోనా ప్రభావం
ప్రతి పౌరునికి అవసరమైన నిత్యవసరాలు, అత్యవసరాలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎలాంటి అందోళనకు గురికావద్దని మహబూబ్‌నగర్ కలెక్టర్ సూచించారు. వ్యక్తిగత దూరం పాటించడం, ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మేలన్నారు.
!['ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం' mahaboobnager collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6605053-thumbnail-3x2-mnr.jpg)
'ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం'
ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోం క్యారంటైన్లో ఉంచామన్నారు. ప్రజలెవరూ బయటకు రావద్దని.. వచ్చినా వ్యక్తిగత దూరాన్ని తప్పుకుండా పాటించాలని కోరారు.
జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు
ఇవీ చూడండి:లాక్డౌన్ దేవుళ్లు: ఈ 2 నెలలు ఇంటి అద్దె ఇవ్వొద్దులే!
Last Updated : Mar 31, 2020, 12:26 PM IST