లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరు గెలుస్తారోనని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ... తెరాస కొత్త వ్యక్తి మన్నె శ్రీనివాసరెడ్డిని బరిలో నిలపగా... కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డి పోటీ చేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చి పార్టీ సీనియర్ నేత అరుణ భాజపాలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. మరి గెలుపు ఎవరిని వరించనుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం ఎవరిది...? - పార్లమెంటు ఎన్నికలు
మహబూబ్‌నగర్ స్థానంలో గెలుపుపై ప్రధాన రాజకీయ పార్టీలు వేటికవే ధీమాగా ఉన్నాయి. తెరాస కొత్త ముఖాన్ని బరిలో దింపగా... ఇటీవల కాంగ్రెస్‌ను వీడి కమల తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకురాలు డీకే అరుణను భాజపా రంగంలోకి దింపింది. మరి ఎక్కువ సార్లు విజయం కైవసం చేసుకున్న కాంగ్రెస్ అదే ఫలితం పునరావృతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
మహబూబ్‌నగర్ లోక్‌సభ