తెలంగాణ

telangana

ETV Bharat / city

కంటైనర్లలో కూలీలు.. పట్టించిన ఫాస్ట్​ట్యాగ్​ - వలస కూలీల కష్టాలు

లాక్​డౌన్​ కారణంగా స్వస్థలాలకు వెళ్లాలని తాపత్రయపడుతున్న వలస కార్మికుల అవసరాన్ని.. సొమ్ము చేసుకోవాలని చూశారు ముగ్గురు డ్రైవర్లు. లారీల యజమాని ఫిర్యాదుతో.. వారి ప్రయాణాన్ని మహబూబ్​నగర్ జిల్లా అడ్డాకుల టోల్​ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు లారీ డ్రైవర్లు పరారవ్వగా.. ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

lorry driver cheated migrants at mahabubnagar
కంటైనర్లలో కూలీలు.. పట్టించిన ఫాస్ట్​ట్యాగ్​

By

Published : May 17, 2020, 3:33 PM IST

లాక్​డౌన్​ కారణంగా తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కోసూరు శివారులోని ద్విచక్ర వాహనాల విడిభాగాలు తయారు చేసే కంపేని మూతపడింది. చేసేది లేక అక్కడ పనిచేసే కార్మికులు స్వస్థలాకు బయలుదేరారు. వీరి అవసరాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు ముగ్గురు డ్రైవర్లు. యజమానికి తెలియకుండా కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేశారు. మూడు కంటైనర్లలో 40 మంది చొప్పున లోపల కూర్చోబెట్టి బయట నుంచి తాళం వేశారు.

ఫాస్ట్​ట్యాగ్​ ఉపయోగించారు.. దొరికారు..

తమిళనాడు నుంచి బిహార్​లోని ముజాఫర్ జిల్లాకు శుక్రవారం కంటైనర్లలో బయలుదేరారు కార్మికులు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్​ప్లాజా వద్ద ఫాస్ట్​ట్యాగ్​ ఉపయోగించడంతో ఆ సందేశం యజమానికి చేరింది. తనకు తెలియకుండా కంటైనర్లు వెళ్లడంతో అనుమానం వచ్చిన లారీల యజమాని.. ఆ తర్వాత వచ్చే టోల్​ప్లాజా నిర్వాహకులకు సమాచారమిచ్చాడు.

పోలీసులను చూడగానే..

అడ్డాకుల టోల్​ప్లాజా వద్ద పోలీసులను గమనించిన ఇద్దరు డ్రైవర్లు లారీలను వదిలేసి పరారయ్యారు. మరో కంటైనర్ మాత్రం ముందే అడ్డాకుల టోల్​ప్లాజాను దాటి పోగా.. హైదరాబాద్ మార్గంలోని మరో టోల్​గేట్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా ఉన్న దాబా వద్ద వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి, ఆహారాన్ని అందించారు పోలీసులు. ఉన్న డబ్బులన్నీ డ్రైవర్లకు ఇచ్చి ఖాళీ చేతులతో మిగిలామని కార్మికులు వాపోయారు.

ఇవీ చూడండి:దూసుకొస్తున్న 'ఉమ్ పున్'​ తుఫాన్- హోంశాఖ హెచ్చరిక​

ABOUT THE AUTHOR

...view details