నాగర్ కర్నూల్ జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలకు చిరుత భయం పట్టుకుంది. అటవీ ప్రాంతాన్ని వదిలి ఆహారం కోసం చిరుత గ్రామాల్లో సంచరిస్తుందన్న ప్రచారం ఆయా గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. బల్మూరు మండలం మైలారం అటవీ ప్రాంతు నుంచి పోలీస్ స్టేషన్ సమీపంలో గల గోదన్ గ్రామం వైపు చిరుతపులి వెళ్లిందని కొంతమంది గ్రామ సర్పంచ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే గోదల్ సర్పంచ్ బల్మూర్ మండల అటవీ శాఖ, పోలీసు శాఖల దృష్టికి తీసుకెళ్లాడు. రెండు శాఖల వాళ్లు చిరుత కోసం గాలించినప్పటికీ అధికారులకు చిరుత అడుగులు, ఆనవాలు ఏవీ లభించలేదు. చిరుత సంచారం ఉన్నట్టు ఎలాంటి జాడలు లేకపోయినప్పటికీ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నల్లమల సమీపంలో చిరుత భయం - leopard Fear In Nallamalla forest Area Villages
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో చిరుతపులి అడవిని వదిలి గ్రామాల్లో సంచరిస్తుందనే ప్రచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
![నల్లమల సమీపంలో చిరుత భయం leopard Fear In Nallamalla forest Area Villages](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6744467-65-6744467-1586541640550.jpg)
నల్లమల సమీపంలో చిరుత భయం
TAGGED:
నల్లమల సమీపంలో చిరుత భయం