ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా... వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. చిరు వ్యాపారులు సైతం కర్ఫ్యూ పాటిస్తున్నారు. వరంగల్‌లోని రహదారులు, ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్సు ప్రయాణ ప్రాంగణాలు జన సందడి లేక వెలవెలబోతున్నాయి.
మహబూబ్‌నగర్‌లో పట్టణ సీఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు కర్ఫ్యూని పర్యవేక్షిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, కమిషనర్ ఇంద్రసేనారెడ్డి పట్టణంలో తిరుగుతూ ప్రజలెవరూ రహదారులపైకి రావద్దని మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.