ఎగువన కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. గతేడాదితో పోలిస్తే... జూరాల నీటి నిలువ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా... ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా... ప్రస్తుతం 316.30గా ఉంది. 9.516 టీఎంసీలకు గానూ... 5.638 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద - ఎగువన కురుస్తున్న వర్షాలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. 9.516 టీఎంసీలకు గానూ... 5.638 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరద