తెలంగాణ

telangana

ETV Bharat / city

భారీ వర్షం.. కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉద్ధృతి - మహబూబ్​నగర్ జిల్లాలో భారీ వర్షం.

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కోయిల్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టు గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఫలితంగా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

huge rain fall in mahabubnager and Narayana pet districts and flood flow continues to koil sager project
జిల్లాలో భారీ వర్షం.. కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉద్ధృతి

By

Published : Sep 26, 2020, 3:43 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శనివారం ఉదయం 7 గంటల వరకు 13.6 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కోయిల్ సాగర్ జలాశయానికి సరిహద్దు మండలాలైన కోయిలకొండ, ధన్వాడ, నారాయణపేట, కోస్గి, మద్దూరు మండలాలలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా భారీగా వరద నీరు కోయిల్​సాగర్​ జలాశయానికి వచ్చి చేరుతోంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా.. గేట్లెత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి

దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల చెరుకు భారీగా వరద రావడంతో... కౌకుంట్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కౌకుంట్ల-ఇస్లాంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్న చింతకుంట మండలంలో భారీ వర్షపాతం నమోదు కావడంతో.. చిన్నవడ్డెమాన్ - చిన్నచింతకుంట, నెల్లికొండి - సీతారాంపేట, పెద్దవడ్డెమాన్- దమజ్ఞానపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఇవీ చూడండి:6.74లక్షల ఎకరాలకు సాగు నీరే లక్ష్యం... సీతారామతో సాధ్యం

ABOUT THE AUTHOR

...view details