మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు భాజపా నేతలు స్వాగతం పలికారు. భాజాపా జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలతో సమావేశమయ్యారు.
పాలమూరులో పర్యటించిన బండారు దత్తాత్రేయ - Himachal Pradesh Bandaru Dattatreya Tour In Mahabubnagar
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. మహిళా దినోత్సవంతో పాటు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పాలమూరులో పర్యటించిన బండారు దత్తాత్రేయ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి డీకే అరుణ, జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డిలను ఆయన శాలువాతో సత్కరించారు. అనంతరం నారాయణపేట జిల్లా కోటకొండలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ, మహిళా దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు.