మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును... హైకోర్టు సీజే రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచార కేసుల సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు... ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా అదనపు మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రఘురామ్ తెలిపారు.
ఆన్లైన్ ద్వారా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే
అత్యాచార, పొక్సో కేసుల విచారణ వేగంగా జరిపేందుకు... మహబూబ్‌నగర్, షాద్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశారు. హైకోర్టు సీజే ఆర్ఎస్ చౌహాన్... ఆన్లైన్ ద్వారా వీటిని ప్రారంభించారు.
ఆన్లైన్ ద్వారా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ప్రారంభించిన హైకోర్టు సీజే
ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూలు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను శుక్రవారం ప్రారంభించనున్నట్టు తెలిపారు. జోగులాంబ గద్వాలలో ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కేసుల సత్వర పరిష్కారానికి బార్ అసోసియేషన్, న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అర్ధరాత్రి అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చారీ వీరవనితలు!
Last Updated : Oct 8, 2020, 2:04 PM IST