రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీటితో జలమయ్యమయ్యాయి. లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌళి, శివశక్తినగర్, బీకేరెడ్డికాలనీలలో ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షంతో.. నీటి ఉధృతి పెరిగి పెద్ద చెరువు అలుగు పారింది. దీంతో ఒక్క సారిగా నీరు దిగువకు రావడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. పట్టణంలోనే సుమారు 10 సెంటిమీటర్ల వర్షం నమోదైంది.
Rain: మోకాల్లోతు నీటిలో మంత్రి పర్యటన.. ముంపు ప్రాంత ప్రజలకు భరోసా - minister srinivas goud recent news
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. పట్టణంలోనే సుమారు 10 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. జలమయమైన ప్రాంతాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.
శ్రీనివాస్ గౌడ్
విషయం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వర్షం దాటికి జలమయమయిన లోతట్టు ప్రాంతాల్లో.. ఆదివారం తెల్లవారుజామున అధికారులతో కలిసి పర్యటించారు. నీరు చేరిన ప్రాంతాలలో తిరిగి కాలనీవాసులతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇదీ చదవండి:Global Warming: భూమాతకు జ్వరమొస్తే అన్నీ ఉత్పాతాలే