నెల రోజుల్లో ప్రభుత్వ పాఠశాల కార్పొరెట్ పాఠశాలగా మారింది. హర్ష ఫౌండేషన్ చొరవతో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచలింగాల గ్రామం ప్రజల సాకారంతో ఇది సాధ్యమైంది. పాఠశాల ప్రారంభోత్సవానికి కలెక్టర్ హరిచందనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్‌గా మారింది.. - నారాయణపేట జిల్లా కలెక్టర్ తాజా ప్రసంగం
ఊరు మనకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే సినిమా డైలాగ్ ఓ వ్యక్తికి ఆదర్శమైంది. తన స్వగ్రామంలో ఉన్న పాఠశాలకు కార్పొరేట్ హంగులు అద్దేలా చేసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచలింగాల గ్రామ ప్రజల సాకారంతో ఇది సాధ్యమైంది.
ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్కూల్‌గా మారింది..
ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల రూపురేఖలు మార్చిన హర్ష పౌండేషన్‌ను అభినందించారు. జాతీయ రహదారి నుంచి పాఠశాల వరకు రోడ్డు వెయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.