తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా భయం: పొలం బడిలో ఆన్‌లైన్ పాఠాలు - మహబూబ్‌నగర్‌ వార్తలు

కరోనా తెచ్చిన భయం..ఆ విద్యార్థినిని పొలం గట్టునే పాఠాలు వినేలా చేసింది. తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం. సాయంత్రం వరకు గట్టునే కూర్చొని ఆన్‌లైన్‌లో‌ పాఠాలు వినడం. తిరిగి ఇంటికి రావడం. లాక్‌డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఆ విద్యార్థినికి ఇదే నిత్య కృత్యం. అసలేందుకు ఇలా?

కరోనా భయం: పొలం బడిలో ఆన్‌లైన్ పాఠాలు
కరోనా భయం: పొలం బడిలో ఆన్‌లైన్ పాఠాలు

By

Published : Jul 26, 2020, 7:11 AM IST

కరోనా భయం పట్టణవాసులనే కాదు.. పల్లెప్రజల్ని, రైతుల్ని వెంటాడుతోంది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని అప్పాయిపల్లికి చెందిన ఓ రైతు సతీసమేతంగా పొలం పనులు చేసుకునేందుకు సొంత వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పిల్లల్ని ఇంటి వద్దే వదిలేస్తే.. కరోనా ఎక్కడ సోకుతుందో అనే భయంతో.. కూతురు, కుమారుడిని కూడా తమతో పాటు పొలానికి తీసుకువచ్చారు. ఏడో తరగతి చదువుతోన్న హరిణికి ఆన్​లైన్‌లో తరగతులు జరుగుతున్న నేపథ్యంలో పొలం వద్దే తరగతులు వినేందుకు ఏర్పాటు చేశారు.

ఓ వైపు తల్లితండ్రులు సాగు పనుల్లో నిమగ్నమై ఉంటే... మరోవైపు హరిణి సెల్ ఫోన్లో ఆన్​లైన్ తరగతులు వింటోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే తరగతులు విని.. సాయంత్రానికి మళ్లీ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తోంది. కుటుంబానికి ఆదాయం, అన్నం పెట్టే వ్యవసాయ క్షేత్రం హరిణికి బడిగా మారింది. పొలం బడిలో ఆన్‌లైన్‌ తరగతుల దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాల్లో నిక్షిప్తం చేసింది.

ఇవీ చూడండి:క్వాసీ జ్యుడిషియల్​ సభ్యులకు శిక్షణ ఇవ్వాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details