జోగులాంబ గద్వాల జిల్లాలోని 11 మండలాలకు చెందిన 800 మంది వలస కూలీలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా రావిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలో చిక్కుకుపోయారు. లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయి.. ఉపాధి లేక.. రవాణా లేక ఇబ్బంది పడుతున్నామని తమను స్వస్థలాలకు పంపాలని జిల్లా అధికారులను వేడుకుంటున్నారు. బతుకు దెరువు కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చామని, లాక్డౌన్ వల్ల ఇక్కడే ఇరుక్కుపోయామని అధికారులు, ప్రజా ప్రతినిధులను స్వస్థలాలకు పంపాలని వేడుకున్నా వారు పట్టించుకోవడం లేదని తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా వలస కూలీలు వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని తమను స్వరాష్ట్రానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన గద్వాల జిల్లా వలస కూలీలు - Gadwal Migration Labor Stucked In Andra Pradesh
తమను స్వస్థలాలకు పంపాలని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇరుక్కుపోయిన జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన 800 మంది వలస కూలీలు స్థానిక అధికారులను వేడుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులను కలిసి సొంతూళ్లకు పంపేందుకు సహకరించమని ప్రాథేయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చిక్కుకుపోయిన గద్వాల జిల్లా వలస కూలీలు