తెలంగాణ

telangana

ETV Bharat / city

వాగులో చిక్కుకున్న యువకుడు.. కాపాడిన గ్రామస్తులు - మహబూబ్​నగర్​లో భారీ వర్షం

దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన వెంకటేశ్​ అనే యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి.. వాగు మధ్యలో ఉన్న ఒడ్డుకు చేరాడు. వాగు అవతల ఒడ్డున ఉన్న ఇస్రంపల్లి గ్రామ యువకులు.. ధైర్యం చేసి వాగు మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని.. తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు.

వాగులో చిక్కుకున్న యువకుడు.. కాపాడిన గ్రామస్తులు
fisherman structed in flood at devarakadra mandal mahabubnager dist

By

Published : Sep 26, 2020, 4:16 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో.. శుక్రవారం రాత్రి ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం వరకు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల పెద్ద చెరువు వద్ద చేపల వేటకు వెళ్లిన వెంకటేశ్​ అనే యువకుడు.. వరద నీటిలో కొట్టుకుపోయి వాగు మధ్యలో ఉన్న ఒడ్డుకు చేరాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు.. ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది సాయంతో వాగులో నుంచి యువకుడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బ్బంది వెనక్కి వచ్చేశారు.

వాగు అవతల ఒడ్డున ఉన్న ఇస్రంపల్లి గ్రామ యువకులు.. ధైర్యం చేసి వాగు మధ్యలో చిక్కుకుపోయిన వ్యక్తిని.. తాడు సాయంతో బయటకు తీసుకొచ్చారు. ధైర్యం చేసిన యువకుల బృందాన్ని.. గ్రామస్తులు అభినందించారు.

ఇవీ చూడండి.నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం

ABOUT THE AUTHOR

...view details