మహబూబ్ నగర్ జిల్లా ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామం గురించి ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గ్రామస్తులు, అధికారుల సమన్వయంతో ఆ గ్రామం ప్రగతి పథంలో నడిచిన వైనం అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆకట్టుకున్నది.
పంచాయతీరాజ్ సమ్మేళనంలో 'ఈటీవీ' కథనం - Etv News Item Played In PanchayatRaj Sammelanam
పచ్చదనం, పరిశుభ్రత, అభివృద్ధికి మారుపేరుగా నిలిచి ఆ గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపించిన తీరును ఈటీవీ కథనంగా మలిచి ప్రసారం చేసింది. ఆ కథనాన్ని పంచాయితీరాజ్ సమ్మేళనంలో ప్రసారం చేస్తూ.. అధికారులకు, సర్పంచ్లకు అవగాహన కల్పిస్తున్నారు.
పాఠంగా మారిన 'ఈటీవీ' కథనం
రాష్ట్రంలో పంచాయితీరాజ్ సమ్మేళనం కార్యక్రమాలు అన్నీ జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈటీవీ కథనాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ.. అందరూ ఇలాగే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కథనం ప్రదర్శించడం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం అధికారులకు కాస్త సులువుగా మారింది.
TAGGED:
పాఠంగా మారిన 'ఈటీవీ' కథనం