Crops Damaged by Rain in Mahabubnagar: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత మూడు రోజులుగా కురిసిన అధిక వర్షాలు పంటలపై ప్రతికుల ప్రభావాన్ని చూపాయి. సాధారణ వర్షపాతంతో పోలిస్తే మహబూబ్‌నగర్‌లో 68 శాతం, నారాయణపేటలో 77 శాతం, జోగులాంబ గద్వాలలో 45 శాతం, నాగకర్నూల్, వనపర్తి జిల్లాల్లో 50 శాతం అధికంగా నమోదైంది.చాలాచోట్ల వరద పంట పొలాల్ని ముంచెత్తింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగైన పత్తి పంట చాలా ప్రాంతాల్లో దెబ్బతింది. రైతులు పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మోటార్లతో నీటిని ఎత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. 15 రోజుల్లో చేతికచ్చే పంట కళ్లముందే పనికిరాకుండా పోతుందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
'పంట చేతికొచ్చే ముందు ఇలా వర్షాలు పడి ఖరాబు అయిపోయాయి. అకాల వర్షాలతో చెరువు నిండి వేసిన పంట మొత్తం దెబ్బతిన్నది. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందే ఎదుర్కొంటున్నాం. పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు. చివరికీ మందు డబ్బా తప్పా ఏం మిగిలే పరిస్థితి లేదు. చేతికొచ్చే పంటలను నష్టపోయాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి '-బాధిత రైతులు